బషీర్బాగ్, వెలుగు: సింగర్ మంగ్లీని లక్ష్యంగా చేసుకొని కొన్ని యూట్యూబ్ చానల్స్, వ్యక్తులు అసభ్యకర పోస్టులతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె వ్యక్తిగత మేనేజర్ మేఘ్ రాజు ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. మధు నాయక్, సుబ్బు, తిరుమలేష్, హిమకాంత్ రెడ్డి వంటి వ్యక్తులు కావాలనే మంగ్లీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బురదజల్లుతున్నారని మండిపడ్డారు. ఈ దుష్ప్రచారంలోకి ఆమె కుటుంబ సభ్యులను లాగడం సరికాదని, , మంగ్లీ ఎటువంటి ఎండోర్స్‌మెంట్స్ చేయలేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, త్వరలోనే నిజనిజాలు వెలుగులోకి వస్తాయన్నారు.

