షూటింగ్‌లలో 40 మంది దాటొద్దు

షూటింగ్‌లలో 40 మంది దాటొద్దు

మొదలైన సినిమా, టీవీ షూటింగులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగ్ లకు అనుమతిచ్చిన ప్రభుత్వం, అందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను రిలీజ్ చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ మంగళవారం జీవో 16ను విడుదల చేశారు. షూటింగ్ లకు సంబంధించి ప్రభుత్వం మరికొన్ని సడలింపులు ఇచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమాలు, టీవీ సీరియళ్ల పోస్టు ప్రొడక్షన్ పనులను వెంటనే చేసుకోవచ్చని తెలిపింది. అలాగే మధ్యలో ఆగిపోయిన సినిమాలు, సీరియళ్ల షూటింగ్ కూ పర్మిషన్ ఇచ్చింది. ఎక్కువ శాతం ఇండోర్ షూటింగ్ లకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. షూటింగ్ లలో 40 మంది కంటే ఎక్కువ పాల్గొనకూడదని స్పష్టం చేసింది. నటీనటుల ఎంపిక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగాలని, యాక్టర్లు మేకప్ ఇంటి దగ్గరే వేసుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాతే 10 ఏళ్ల లోపు, 60 ఏళ్లకు పైబడిన యాక్టర్లను షూటింగ్ కు తీసుకెళ్లాలని చెప్పింది. షూటింగ్ స్పాట్ లో శానిటైజర్లు, మాస్కులు తప్పనిసరిగా వాడాలంది. 6 అడుగులు ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలంది. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. యాక్టర్ల ఆరోగ్య భద్రత నిర్మాతలదేనని, ఇందుకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది.

For More News..

ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్ చేసేవారికి నిరాశ

కరోనా దెబ్బకు జాడ లేకుండా పోయిన జాబులు

కరోనా టెన్షన్.. పుకార్లతో పరేషాన్