
బీహార్‌లో రెండో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓటర్లనుద్దేశించి ట్వీట్ చేశారు. ఓటు వేయండి మీకు నచ్చిన కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందంటూ ప్రజలకు సూచించారు. తాను కొర్హా, కిషన్‌గంజ్‌కు వస్తున్నానని.. పెరుగుతున్న నిరుద్యోగం, రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు, బలహీనమైన ఆర్థిక వ్యవస్థగ వంటి అంశాలపై మాట్లాడనున్నట్లు రాహుల్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ మహాకూటమిలో భాగంగా RJDతో కలిసి పోటీ చేస్తోంది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మొదటి విడత అక్టోబర్ 28న పోలింగ్ జరిగింది. రెండో దశ ఎన్నికలు 94 నియోజకవర్గాల్లో జరుగుతుండగా.. దాదాపు 1500 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడో విడత ఎన్నికలు ఈ నెల 7న జరుగనున్నాయి.
आज आप सबसे मिलने बिहार के कोढ़ा और किशनगंज में आ रहा हूँ। बढ़ती बेरोज़गारी, किसानों पर आपदा, कमज़ोर अर्थव्यवस्था जैसे कई मुद्दों पर बात होगी।
साथ ही आज बिहार के कुछ ज़िलों में वोटिंग का दूसरा चरण है। वोट ज़रूर दें ताकि आपकी पसंद की नई सरकार बने। pic.twitter.com/Y0pZTo4MKN
— Rahul Gandhi (@RahulGandhi) November 3, 2020