‘దోచేవారెవరురా’లో కామెడీ అద్భుతం : అనిల్ రావిపూడి

‘దోచేవారెవరురా’లో కామెడీ అద్భుతం : అనిల్ రావిపూడి

‘దోచే వారెవరురా’ చిత్రాన్ని శివ నాగేశ్వర రావు తనదైన స్టైల్ లో తెరకెక్కించారని దర్శకుడు అనిల్ రావిపూడి కొనియాడారు. ఈ సినిమాలోని ‘గుండా గాళ్లమండి’ లిరికల్ సాంగ్ ను ఆయన విడుదల చేశారు. ‘‘ సాంగ్ చాలా బాగుంది. ఈ సినిమా అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను. కామెడీ  టైమింగ్ అద్భుతం. ఈ చిత్రం విజయం సాధించాలని..  చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను’’ అని అనిల్ రావిపూడి తెలిపారు. ‘గుండా గాళ్లమండి’  పాటను సింగర్ రమ్య బెహరా పాడారు.ఈ సాంగ్ ను రామోజీఫిలిం సిటీలో గ్రాండ్ గా చిత్రీకరించారు. 

IQ క్రియేషన్స్ పతాకంలో మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివనాగేశ్వరరావు కామెడీ థ్రిల్లర్ గా 'దోచేవారెవరురా' సినిమాను తెరకెక్కించారు.ఇందులో నూతన నటీ నటులు నటించారు. బొడ్డు కోటేశ్వరరావు రూపొందిస్తున్న ఈ చిత్రంలో అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి ప్రత్యేక పాత్రలలో కనిపించనున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.