
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి హైదరాబాదులో ఓ డాక్టర్ మరణించాడు. వారం రోజుల కిందట జ్వరంతో కిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు డాక్టర్ జ్ఞానేశ్వర్ (70). అనుమానంతో కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తెలింది. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 8 గంటలకు మరణించాడని తెలిపారు కుటుంబసభ్యులు. కరోనాతో పాటు బిపి కూడా ఉండటంతో జ్ఞానేశ్వర్ చనిపోయాడని డాక్టర్లు తెలిపారన్నారు. కాకతీయ మెడికల్ కాలేజ్ లో డాక్టర్ డిగ్రీ పొందిన జ్ఞానేశ్వర్.. కరోనా పేషంట్స్ కు ట్రీట్మెంట్ ఇవ్వలేదన్నారు. లాక్ డౌన్ నుంచి జ్ఞానేశ్వర్ అతడి క్లినిక్ ను బంద్ చేశారని చెప్పారు.