టీవిలో కనిపించాలన్న ఆశ చాలామందికి ఉంటుంది. లైఫ్ లో ఒకసారైనా సినిమాల్లో, టీవీల్లో కనిపించాలని అనుకునేవారు చాలామందే ఉంటారు. అలా తమ ప్యాషన్ ని ఫాలో అయ్యి... కల నెరవేర్చుకున్నవారు చాలా చాలా తక్కువ ,మంది ఉంటారు. తెరపై కనిపించాలనే పిచ్చితో మోసపోయినోళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అలా ఓ ప్రముఖ డాక్టర్ డాక్టర్ భార్య మోసగాడి వలకు చిక్కింది. సీరియల్ హీరోయిన్ వేషం ఇప్పిస్తానని చెప్పి ఆమెకు రూ.60 లక్షలు టోకరా వేశాడు మోసగాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని ఓ ప్రముఖ డాక్టర్ భార్య మోసగాడి వలలో చిక్కుకుని సుమారు రూ.60 లక్షలు పోగొట్టుకుంది. ఆమెకి నటన పై ఉన్న ఆసక్తి మోసగాడి వలలో పడే విధంగా చేసింది. తనకు సీరియల్ డైరెక్టర్ లు తెలుసని.. సీరియల్ లో హీరోయిన్ వేషం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి ఆమెను నమ్మించి పెద్ద మొత్తంలో నగదు కాజేసాడు. మోసపోయామని తెలుసుకున్న ఆ దంపతులు లబోదిబోమంటున్నారు.
విశాఖపట్నం , మధురవాడ కి చెందిన జంబాడ లక్ష్మీ వరప్రసాద్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పరిచయమైన మణుగూరు కి చెందిన ప్రముఖ డాక్టర్ భార్య ను ట్రాప్ చేసి ఆమెకు నటన పై ఉన్న ఆసక్తి తెలుసుకుని మాయమాటలతో బుట్టలో వేసుకుని 60 లక్షలు కాజేసాడు. 23 లక్షల రూపాయలు అతను విశాఖపట్నం కంచర్ల పాలెం పరిధిలో గల షోరూంలో కారు కొనుగోలు చేయడం కోసం షో రూమ్ అకౌంట్లో 23 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఎంతకీ అదిగో ఇది అంటూ కల్లిబోల్లి మాటలు తప్ప సీరియల్ లో అవకాశం రాకపోవడంతో తను మోసపోయానని తెలుసుకున్న ఆమె మణుగూరు పోలీసులను ఆశ్రయించారు.
దీంతో మణుగూరు పోలీసులు షో రూమ్ అకౌంట్ ను హోల్డ్ చేశారు. షో రూమ్ యాజమాన్యం అక్కడి కంచర్లపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. ఆంధ్ర నుంచి ఒక ఏఎస్ఐ స్థాయి అధికారి వచ్చి డాక్టర్ దంపతులను బెదిరించారు అయిన వారు ఎంతకు బెదరకపోగా ఆయనపై పలు ప్రశ్నలు సంధించారు..దీంతో వారు చేసేదేం లేక వెనుతిరిగి వెళ్ళిపోయారు... దీనితో ఈ బాగోతం మొత్తం బయటపడింది.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెపుతున్న చదువుకున్న వారు కూడా ఇలా మోసపోవడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
