నీట్ పేరుతో స్టూడెంట్లను బంధిస్తారా ? ..ఎన్ఎంసీ తీరుపై డాక్టర్ సంఘాల ఫైర్

నీట్ పేరుతో స్టూడెంట్లను బంధిస్తారా ? ..ఎన్ఎంసీ తీరుపై డాక్టర్ సంఘాల ఫైర్

హైదరాబాద్, వెలుగు: నీట్ యూజీ–2026 పరీక్షల నిర్వహణ పేరుతో మెడికల్ స్టూడెంట్లపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆంక్షలు విధించడాన్ని డాక్టర్ల సంఘాలు ఖండించాయి. నీట్ ఎగ్జామ్ కు ముందురోజు, నీట్ ఎగ్జామ్ రోజు దేశంలోని మెడికల్ కాలేజీ విద్యార్థులకు సెలవులు ఇవ్వకూడదని ఎన్ఎంసీ ఇటీవల ఆదేశించింది. మెడికల్ కాలేజీల విద్యార్థులు హాస్టల్ గదుల్లోనే ఉండాలని, బయటకు రాకూడదని చెప్పింది. ఈ నిర్ణయంపై జాతీయ స్థాయిలో ఫైమాతోపాటు  రైట్ టు లైఫ్, రాష్ట్ర హెచ్ఆర్డీఏ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, ఎన్ఎంసీకి విడివిడిగా లేఖ రాశాయి.

ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ నీట్ ఎగ్జామ్స్ లో అక్రమాలు జరుగుతాయన్న అనుమానంతో మెడికల్ విద్యార్థులను నేరస్తులుగా చూడటమేంటని ప్రశ్నించారు. ఇది విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని మండిపడ్డాయి. పరీక్షల పవిత్రతను కాపాడాల్సింది అధికారులేనని, విద్యార్థులను బంధించడం సరికాదన్నారు. ఎన్ఎంసీ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్​చేశారు. అయితే, గతంలో జరిగిన నీట్ పరీక్షల్లో కొన్నిచోట్ల మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు సాల్వర్ గ్యాంగ్స్ తో చేతులు కలిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన సూచనల మేరకు గత నెల 23న ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ మెడికల్​స్టూడెంట్లకు సెలవులు రద్దు చేస్తూ  నిర్ణయం తీసుకుంది.