యజమాని చనిపోయినా ఆ కుక్క మాత్రం వదల్లేదు.. యజమాని మృతదేహాన్ని తీసుకెళ్తుంటే వాహనం వెంటన కిలోమీటర్లు పరుగెత్తింది. వాహనం సాగినా.. ఆగినా..దూరం ఎంతైనా ఆ కుక్క అడుగులు ఆగలేదు. తన మాట్లాడలేని మూగజీవి అయినా అది విశ్వాసాన్ని చాటుకుంది. మధ్యప్రదేశ్ లో తన యజమాని చనిపోతే.. కడసారి చూపుకోసం కుక్క నాలుగు కిలోమీటర్లు పరుగెత్తిన హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్..సోషల్ మీడియాలో నెటిజన్లను కదిలించింది.
మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో ఓ పెంపుడు కుక్క తన యజమాని చనిపోతే..కడసారి చూపు కోసం నాలుగు కిలోమీటర్లు పరుగెత్తింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. హృదయాలను కదిలించే సీన్స్ చూసిన నెటిజన్ల కంటనీరు పెట్టించింది.
శివపురి జిల్లా బడోరా గ్రామానికి చెందిన జగదీస్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జగదీష్ మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన గ్రామస్తులు, బంధువులకు అక్కడ ఓ దృశ్యం ఆశ్చర్యపర్చింది. పోస్ట్ మార్టమ్ కోసం మృతదేహాన్ని ట్రాక్టర్ లో తరలిస్తుండగా.. జగదీష్ పెంపుడు కుక్క పరుగెత్తడం అందరి దృష్టిని ఆకర్షించింది. సుమారు ఐదుకిలోమీటర్లు ఆ కుక్క వాహనం వెంట పరుగెత్తడం చూసేవారి మనుసు ద్రవింపజేసింది.
పోస్ట్ మార్టమ్ తర్వా త కూడా ఇంటి దగ్గర, శ్మశాన వాటిక కు తరలిస్తున్న సమయంలో శవం పక్కనే కుక్క కూర్చొని ఉండడం కనపించడం చూసి గ్రామస్తులు, బంధువులు ఆశ్చర్యపోయారు. తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు శవాన్ని వాహనంలో తీసుకెళ్తుండగా.. కుక్క దానివెంట పరుగెత్తుతూ వెళ్లింది..వాహనం ఎక్కడ ఆగినా దాని చుట్టూ తిరుగుతూ అరిచింది.ఇదంతా గమనించిన ఓ గ్రామస్తుడు కుక్క కదలికలను సెల్ ఫోన్ లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. నెటిజన్లతో కంటతడి పెట్టించింది.
ఈ వైరల్ వీడియోలపై విశేష స్పందనలు వచ్చాయి. ‘‘మనుషులు కూడా చూపలేనంత విధేయత.. కొన్ని సార్లు విశ్వాసం మాటల్లో వ్యక్తం చేయబడదు.. ఆ కుక్క తన యజమానిపట్ల విశ్వాసాన్ని మౌనంగా చూపింది.’’ అంటూ క్యాప్షన్లతో పోస్టులు పెట్టారు.
ఇక కొందమంది నెటిజన్లు ఆకుక్క భవిష్యతుపై ఆరా తీశారు.. ఆ కుక్క ఎక్కడ ఉంది.. దానిని ఎవరైనా దత్తత తీసుకున్నారా.. లేకుంటే వెంటనే తీసుకోండి అంటూ పోస్టులు పెట్టారు.
