విశ్వాసం అంటే ఇదీ: ఏడాది తర్వాత కూడా ఓనర్‌ను గుర్తు పట్టిన కుక్క

 విశ్వాసం అంటే ఇదీ: ఏడాది తర్వాత కూడా ఓనర్‌ను గుర్తు పట్టిన కుక్క

కుక్క ఎంతటి విశ్వాస జంతువో మనందరికి విదితమే. అందుకే చాలామంది కుక్క‌లను పెంచుకుంటారు. ఇంట్లో వారు తిన్నా, తినకపోయినా పర్లేదు కానీ, అది తిన్నదా! లేదా! అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. అలా అని దాని కృతజ్ఞతను మనం మరాకుడదు. అది కూడా మ‌నిషిపై అమిత‌మైన ప్రేమ‌ను చూపిస్తుంది. యజమాని చెప్పిందే చేస్తుంది. అతని రాకకై వేచిచుస్తుంది. అలాంటి కుక్కే ఇదీ. 

ఏడాది తరువాత తన యజమాని వస్తే కుక్క అతన్ని గుర్తుపట్టి.. అతని కలుసుకోవడానికి పరుగులు తీయడం నెటిజన్లకు కన్నీరు పెట్టిస్తోంది. రిచీ అనే గ్రేట్ పైరినీస్ జాతికి చెందిన ఓ కుక్కను దంపతులు చాలా ఇష్టంగా పెంచుకునేవారు. కొన్నాళ్ల అనంతరం ఇంటి పెద్ద ఏడాది పాటు ఇంటికి దూరంగా ఉండవలసి వస్తుంది. ఆ కాలం గడిచాక అతను ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఎయిర్ పోర్టులో వారి మధ్య జరిగిన సన్నివేశాలను ఈ వీడియోలో చూపించారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @ritchiethepyr

తన ప్రియమైన యజమానిని గుర్తు పట్టిన కుక్క, అతనివైపు పరుగెత్తుతున్నప్పుడు అతని ఉత్సాహానికి అవధులు ఉండవు. కుక్క కూడా అతనిపై ఆప్యాయంగా ముద్దులు కురిపిస్తూ వెచ్చని కౌగిలింతలతో ముంచెత్తుతుంది. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా చూసేయండి.