మార్కెట్లోకి ‘బిగ్‌బజార్‌‌’  డాలర్‌‌ బాండ్లు

మార్కెట్లోకి ‘బిగ్‌బజార్‌‌’  డాలర్‌‌ బాండ్లు

రూ.3,500 కోట్ల సమీకరణ కోసమే

ఇష్యూకి బోర్డు ఆమోదం

రిటైల్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ కొనుగోలుకే

మెరుగుపడనున్న కంపెనీ ఇబిటా

ముంబై: బిగ్‌‌ బజార్‌‌‌‌ రిటైల్‌‌ ఔట్‌‌లెట్‌‌ను ఆపరేట్‌‌ చేస్తున్న కిషోర్‌‌‌‌ బియానీ ఫ్యూచర్‌‌‌‌ రిటైల్‌‌,  బాండ్ల ఇష్యూ ద్వారా నిధులను సమీకరించేందుకు సిద్ధమయ్యింది. డాలర్ బాండ్లను ఇష్యూ చేయడం ద్వారా  రూ. 3,550 కోట్లను సేకరించడానికి బోర్డు ఆమోదం వచ్చిందని కంపెనీ ఎక్సేంజ్‌‌ ఫైలింగ్‌‌లో  పేర్కొంది.  రిటైల్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ ఆస్తులను కొనుగోలు చేయడానికి వీలున్న వివిధ రకాల ఫండ్‌‌ రైజింగ్‌‌ ఆప్షన్‌‌లను  బోర్డు చర్చించిందని పేర్కొంది.   గతేడాది అక్టోబర్‌‌‌‌ 12 న జరిగిన బోర్డు మీటింగ్‌‌లో, ఫ్యూచర్‌‌‌‌ గ్రూప్‌‌కు చెందిన ఫ్యూచర్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌ రిటైల్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ ఆస్తులను కొనుగోలు చేయడానికి బోర్డు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.  మార్కెట్‌‌ కండిషన్స్, రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా లాంగ్ టెర్మ్‌‌ ఫండ్స్‌‌ను,  డాలర్‌‌‌‌ బాండ్ల ద్వారా సమీకరించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని ఫ్యూచర్‌‌‌‌ రిటైల్‌‌ ఎక్సేంజ్‌‌ ఫైలింగ్‌‌లో పేర్కొంది.  ఈ ఫండ్‌‌ రైజింగ్‌‌పై  సలహాలివ్వడానికి నాలుగు ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ బ్యాంక్‌‌లను కంపెనీ నియమించిందని గతంలో  వార్తలొచ్చాయి. ఈ కొనుగోలును ఒకే దఫా లేదా వివిధ దఫాలలో, డైరక్ట్‌‌గా ఒకే మొత్తంలో  కొనుగోలు చేయడం లేదా ఇరు కంపెనీలు అంగీకారం ప్రకారం వివిధ విధానాలలో కొనుగోలు చేయడం అనే అంశాలపై  బోర్డు చర్చించింది.

మెరుగుపడనున్న కంపెనీ డెట్‌‌, ఇబిటా రేషియో …

ఫ్యూచర్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌ రిటైల్​ ఆస్తుల విలువ రూ. 4,000 కోట్లుగా ఉంటుంది. ఈ కొనుగోలు వలన ఫ్యూచర్‌‌‌‌ రిటైల్‌‌ చెల్లిస్తున్న రూ. 650 కోట్ల  వార్షిక లీజ్ మిగులుతాయి. ఫలితంగా 2019 లో 2.4 రేట్లుగా ఉన్న డెట్‌‌, ఇబిటా రేషియో, 2021, ఏప్రిల్‌‌  నాటికి 1.5 రెట్లకు తగ్గుతుంది. వచ్చే మూడేళ్లలో ఈ రేషియో 0.2 రెట్లు కంటే దిగువకొస్తుంది.  దీని వలన కంపెనీ ఆపరేటింగ్‌‌ క్యాష్‌‌ ఫ్లో మెరుగుపడడమే కాకుండా కంపెనీ ఇబిటా గ్రోత్‌‌ నిలకడగా ఉంటుంది. ఈ రెండు కంపెనీలను వేరు చేయటం వలన వీటి మధ్య ఉన్న కార్పొరేట్‌‌ లింకేజ్‌‌ తగ్గుముఖం పడుతుంది.  ఫ్యూచర్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌కు అప్పులిచ్చిన వారికి ఫ్యూచర్‌‌‌‌ రిటైల్‌‌  కార్పొరేట్‌‌ గ్యారెంటీగా ఉంది. ఇది  ఒక ముగింపుకొస్తుంది.  ఫ్యూచర్‌‌‌‌ రిటైల్‌‌  బిగ్‌‌ బజార్‌‌‌‌ను ఆపరేట్‌‌ చేయడంతో పాటు ఈజీ డే, హెరిటేజ్‌‌ ఫ్రెష్‌‌ వంటి చిన్న రిటైల్‌‌ ఔట్‌‌ లెట్‌‌లను కూడా నిర్వహిస్తోంది.