కేసీఆర్ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి

ఉస్మానియా వర్శిటీ సెలవులు పొలిటికల్ హీట్ పెంచాయి. మే 1 నుంచి 31 వరకు వేసవి సెలవులిస్తున్నట్లు చీఫ్  వార్డెన్  ఉత్తర్వులిచ్చారు. అయితే నీటి సమస్య, కరెంటు కోతల్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించడం రాజకీయ వివాదానికి కారణమైంది. కాంగ్రెస్ పాలనలో విద్యుత్తు కోతలతోపాటు తాగునీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉన్నాయో చెప్పడానికి ఇదే నిదర్శనమని కేసీఆర్ ఫైర్ అయ్యారు. మరోవైపు ఏటా ఇలాగే నీటి, కరెంటు సమస్యను ప్రస్తావిస్తూ వర్సిటీకి సెలవులిస్తామని చీఫ్ వార్డెన్ స్పష్టం చేశారు. 

ఇంకోవైపు వర్శిటీలో నీటి సమస్య, కరెంట్ కోతల్లేవన్నారు డిప్యూటీ సీఎం భట్టి. మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్రంగా ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని ట్వీట్ చేశారు. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గతేడాది వర్శిటీ ఉత్వర్వుల్ని ట్వీట్ కు ట్యాగ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.