అభివృద్ధి కోసం ఎంతో చేయాలి : నిర్మలా సీతారామన్

అభివృద్ధి కోసం ఎంతో చేయాలి : నిర్మలా సీతారామన్

విశాఖపట్నం: భారతదేశం తన జీడీపీ వృద్ధిని పెంచుకోవడానికి అన్ని స్థాయుల్లో కృషి అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం అన్నారు. గీతం విశ్వవిద్యాలయం వైజాగ్ క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో వికసిత్​ భారత్ అంబాసిడర్ క్యాంపస్ డైలాగ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘‘2047 నాటికి మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని మన ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారు.

జీడీపీ దానికదే పెరగదు.  కిందిస్థాయి నుంచి ప్రయత్నాలు జరగాలి. తలసరి ఆదాయం అధికమవ్వాలి. గతంలో జరిగిన పొరపాట్ల కారణంగా నష్టం వాటిల్లింది. గత దశాబ్దం నుంచి ఎంతో అభివృద్ధి జరిగింది. వికసిత భారత లక్ష్యానికి భారత్​ దగ్గరవుతోంది. 2014కు ముందు కేంద్ర ప్రభుత్వంలో ఎంతో అవినీతి ఉండేది. ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోంది”అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా గీతం విశ్వవిద్యాలయం అధ్యక్షుడు  మతుకుమిల్లి భరత్‌‌‌‌‌‌‌‌ స్వాగతోపన్యాసం చేసి కేంద్ర మంత్రిని సత్కరించారు.