- రంగారెడ్డి జిల్లాలోని ఆరు స్థానాల్లో నాలుగు చోట్ల పాగా
- బీఆర్ఎస్ ఖాతాలోకి ఇబ్రంహీంపట్నం, ఆమన్‌గల్
- వికారాబాద్ జిల్లాలో మూడు చోట్లా హస్తమే
- మేడ్చల్‌లో రెండు చోట్ల బీఆర్ఎస్
చేవెళ్ల/షాద్‌నగర్/ఇబ్రహీంపట్నం, వెలుగు: మున్సిపల్‌ఎన్నికల్లో అధికార పార్టీ హవా కొనసాగించింది. రంగారెడ్డి, మేడ్చల్మల్కాజిగిరి, వికారాబాద్జిల్లాల్లో మొత్తం13 మున్సిపల్చోట్ల ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నది. రంగారెడ్డి జిల్లాలో ఆరు మున్సిపల్స్థానాలకు నాలుగు చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీఆర్ఎస్గెలిచింది.
చేవెళ్ల, శంకర్పల్లి, షాద్‌నగర్‌లో చైర్‌పర్సన్‌కు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్ దాటింది. మొయినాబాద్‌లో మాత్రం ఇండిపెండెంట్ల మద్దతుతో చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలున్నాయి. ఇబ్రహీంపట్నం, ఆమన్‌గల్ మున్సిపాలిటీలను బీఆర్ఎస్తన ఖాతాలో వేసుకున్నది. బీజేపీ ఒక్క మున్సిపాలిటీని కూడా గెలవలేకపోయింది.
శంకర్‌పల్లిలో అయితే ఖాతా కూడా తెరవలేదు. చేవెళ్లలో మూడు, షాద్ నగర్లో ఒకటి, ఇబ్రహీంపట్నంలో రెండు స్థానాలు, ఆమన్‌గల్‌లో ఆరు, మొయినాబాద్4 వార్డుల్లో విజయం సాధించింది. ఆరు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా చూస్తే.. 126 వార్డుల్లో 54 కాంగ్రెస్, 47 బీఆర్ఎస్, 16 బీజేపీ, తొమ్మిది స్థానాలను ఇండిపెండెంట్అభ్యర్థులు గెలుపొందారు.
మూడు చోట్ల స్పష్టమైన మెజారిటీ
చేవెళ్లలో 18 వార్డులు ఉండగా.. 11 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 3 చోట్ల బీజేపీ గెలిచింది. శంకర్పల్లి మున్సిపాలిటీలో 15 వార్డులకు 9 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 1 స్థానంలో ఇండిపెండెంట్అభ్యర్థి గెలిచారు. షాద్ నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులుండగా..15 కాంగ్రెస్, 11 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్అభ్యర్థి గెలిచారు. మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీకి చైర్పర్సన్ ఎన్నికకు కావాల్సిన స్పష్టమైన మెజారిటీ వచ్చింది.
వికారాబాద్జిల్లాలోనూ కాంగ్రెస్సే..
వికారాబాద్ : వికారాబాద్‌జిల్లాలో వికారాబాద్, కొడంగల్, తాండూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్హవా కొనసాగింది. పరిగిలో మాత్రం ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. వికారాబాద్‌లో 34 వార్డులు ఉండగా, రెండు వార్డుల్లో ఇప్పటికే కాంగ్రెస్‌నుంచి ఒకరు, బీఆర్ఎస్నుంచి మరొకరు ఏకగ్రీవమయ్యాయి.
బీఆర్ఎస్నుంచి ఏకగ్రీవమైన అభ్యర్థి కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్ఇప్పటికే రెండు స్థానాలు గెలుచుకున్నట్టయ్యింది. మిగిలిన 32 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్16, బీఆర్ఎస్ 10, బీజేపీ 4, ఎంఐఎం 1, ఇండిపెండెంట్అభ్యర్థి ఒకరు గెలుపొందారు. 16వ వార్డు నుంచి గెలుపొందిన ఇండిపెండెంట్అభ్యర్ధి కూడా కాంగ్రెస్‌లో చేరారు.
కొడంగల్‌లో 12 స్థానాలు ఉండగా, కాంగ్రెస్ 10, బీఆర్ఎస్, ఇండిపెండెంట్అభ్యర్థులు ఒక్కో వార్డులో విజయం సాధించారు. తాండూరులో 36 వార్డులుండగా, కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 12, బీజేపీ 3, ఎంఐఎం 1,ఇండిపెండెంట్అభ్యర్థి ఒకరు గెలుపొందారు.
మేడ్చల్ కలెక్టరేట్: మేడ్చల్మల్కాజిగిరి జిల్లాలోని ఎల్లంపేట్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 8, బీజేపీ 4 స్థానాలను దక్కించుకుంది. మూడుచింతలపల్లిలో బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 9, బీజేపీ ఒక చోట విజయం సాధించింది. ఈ రెండు చోట్ల బీఆర్ఎస్పూర్తి మెజారిటీ దక్కించుకుని చైర్పర్సన్స్థానాలను తన ఖాతాలో వేసుకున్నది.
ఇబ్రహీంపట్నంలో కారు జోరు
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులుండగా..13 బీఆర్ఎస్, 8 కాంగ్రెస్, 2 బీజేపీ, 1 ఇండిపెండెంట్విజయం సాధించారు. 7వ వార్డు సీతారాంపేట్‌లో 1000 ఓట్లు పోల్‌కాగా, కాంగ్రెస్‌నుంచి టేకుల కమలాకర్‌రెడ్డికి 492 , బీఆర్ఎస్అభ్యర్థి నుండి టేకుల సుదర్శన్‌రెడ్డికి 494, ఓట్లు వచ్చాయి. దీంతో కేవలం 2 ఓట్ల తేడాతో బీఆర్ఎస్అభ్యర్థి విజయం సాధించారు. 24 వార్డుల్లో పోటీచేసిన కాంగ్రెస్ కేవలం 20 ఓట్లలోపు తేడాతో ఐదు స్థానాలను కోల్పోయింది.
1వ వార్డులో బీజేపీ అభ్యర్థి ముత్యాల శ్యామలకు 302 ఓట్లు, కాంగ్రెస్‌నుంచి పోటీ చేసిన చింతం రాధమ్మకు 285 ఓట్లు వచ్చాయి. 4వ వార్డులో బీఆర్ఎస్అభ్యర్థి కొండ్రు ప్రవీణ్‌కుమార్ కు 392, కాంగ్రెస్ అభ్యర్థి యాచారం శ్రీకాంత్ కు 379 ఓట్లు వచ్చాయి. 19వ వార్డులో బీఆర్ఎస్అభ్యర్థి ఆకుల యాదగిరికి 430, కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ఫెరోజ్కు 424 ఓట్లు వచ్చాయి. 23 వార్డులో బీఆర్ఎస్అభ్యర్థి నీలం శ్వేతకు 370 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చెనమోని చంద్రకళ కు 358 ఓట్లు పడ్డాయి. ఈ ఐదు స్థానాల్లో కాంగ్రెస్గెలిచి ఉంటే బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఉండేది.
12వ వార్డులో బీఆర్ఎస్అభ్యర్థి కొండిగారి త్రిలోక్‌కుమార్(మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు కొడుకు) కాంగ్రెస్అభ్యర్థిపై100 ఓట్ల తేడాతో గెలిచాడు. ఆమనగల్ లో 15 వార్డులుండగా...8 బీఆర్ఎస్, 6 బీజేపీ, 1 స్థానం కాంగ్రెస్ గెలుచుకుంది.
మొయినాబాద్‌లో ఉత్కంఠ
మొయినాబాద్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి మ్యాజిక్ఫిగర్రాలేదు. ఇక్కడ 26 వార్డులుండగా..10 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్, 4 బీజేపీ, ఆరుగురు ఇండిపెండెంట్లు గెలిచారు. అయితే ఇండిపెండెంట్లలో ఇద్దరు బీజేపీ రెబల్, మరో ఇద్దరు కాంగ్రెస్ రెబల్అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు. మ్యాజిక్ ఫిగర్‌కు కాంగ్రెస్‌కు నలుగురు అభ్యర్థుల అవసరం ఉంది. దీంతో పార్టీ పెద్దలు ఇండిపెండెంట్లతో మంతనాలు సాగిస్తున్నారు.
