ప్రజా పాలనకు పట్టంకట్టిన మున్సి పల్ తీర్పు : చనగాని దయాకర్

ప్రజా పాలనకు పట్టంకట్టిన మున్సి పల్ తీర్పు : చనగాని దయాకర్
  •     కేటీఆర్​కు ప్రజలు గుణపాఠం చెప్పారు: చనగాని దయాకర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కార్ కొనసాగిస్తున్న ప్రజా పాలనకు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కేటీఆర్ పొగరుబోతు మాటలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ శిఖండి రాజకీయాలకు తెలంగాణ సమాజం తగిన బుద్ధి చెప్పిందన్నారు. 

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. రాబోయే పదేళ్ల కాంగ్రెస్ పాలనను ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారనడానికి నిదర్శనంగా నిలుస్తాయన్నారు. బీఆర్ఎస్ కు వరుస ఓటములు ఎదురైనా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తీరు మాత్రం మారడం లేదన్నారు. ప్రజా తీర్పుతోనైనా వారిలో మార్పు రావాలన్నారు. 

గాంధీ భవన్​లో సెలబ్రేషన్స్

మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ క్యాడర్​లో జోష్ కనిపించింది. దీంతో హైదరాబాద్ సిటీ నాయకులు, కార్యకర్తలు గాంధీ భవన్​కు చేరుకొని సంబరాలు చేసుకున్నారు. డప్పు చప్పుళ్లతో, కాంగ్రెస్ జిందాబాద్, రాహుల్, రేవంత్ నాయకత్వం వర్ధిల్లాలని అంటూ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ జెండాలు చేతపట్టుకొని డ్యాన్సులు చేశారు. పటాకులు కాల్చి,  కేక్ కట్ చేసి,  స్వీట్లు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరో వైపు ‘‘దమ్మున్న మొనగాడు రేవంత్ అన్న’’ అంటూ గాంధీ భవన్ ఆవరణలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.