LSG vs MI: ముంబైకు చావో రేవో.. లక్నోతో ఓడితే ఇంటికే

LSG vs MI: ముంబైకు చావో రేవో.. లక్నోతో ఓడితే ఇంటికే

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ డేంజర్ జోన్ లో పడింది. వరుస పరాజయాలతో ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ ల్లో మూడు మ్యాచ్ ల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో నిలిచింది. ఒక జట్టు ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే కనీసం 8 మ్యాచ్ ల్లో గెలిచి తీరాలి. ముంబై మిగిలిన 5 మ్యాచ్ ల్లో విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్ కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 30) లక్నో సూపర్ జయింట్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. 

లక్నోలోని ఏకేనా క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ముంబైకి చావో రేవోలాంటిది. ఈ మ్యాచ్ లో ముంబై ఓడిపోతే ఐపీఎల్ నుంచి దాదాపుగా నిష్క్రమిస్తుంది. హార్దిక్ కెప్టెన్సీలో ముంబై పేలవ ప్రదర్శన చేస్తుంది. బ్యాటింగ్ లో తిలక్ వర్మ మినహాయిస్తే ఎవరూ నిలకడగా రాణించడం లేదు. ఇక బౌలింగ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. బుమ్రా ఒక్కడే ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నాడు. స్టార్ ఆటగాళ్లతో నిండిన ముంబై స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే గెలుపు పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టోర్నీ నుంచి దాదాపుగా ఇంటి ముఖం పట్టింది.   

మరోవైపు లక్నోకు సైతం ఈ మ్యాచ్ కీలకంగా మారింది. 9 మ్యాచ్ ల్లో 5 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో 5 వ స్థానంలో నిలిచింది.  గత మ్యాచ్ లో రాజస్థాన్ తో సొంతగడ్డపై ఓడిపోయిన లక్నో.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ లో యువ పేసర్ మాయాంక్ యాదవ్ లక్నో జట్టులోకి రావడంతో బలంగా తయారైంది. మరి ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై విజయం సాధిస్తుందో.. లేకపోతే చేతులెత్తేస్తుందో చూడాలి. 

లక్నో సూపర్ జయింట్స్ ప్లేయింగ్ 11 (అంచనా) :

క్వింటన్ డి కాక్, KL రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యష్ ఠాకూర్/ మయాంక్ యాదవ్

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 (అంచనా):

క్వింటన్ డి కాక్, KL రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, M. సిద్ధార్థ్, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్