
ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను బురిడి కొట్టించారు సైబర్ నేరగాళ్లు. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏషియన్ కాలనీకి చెందిన అనిల్ కుమార్ ఇన్స్ స్టాగ్రామ్ లో వచ్చిన మెసేజ్ కు స్పందించాడు. ఆన్ లైన్ లో విడతల వారీగా పెట్టుబడి పెట్టి రూ.1,10,000 డ్రా చేసుకొన్నాక ఆశ చూపి అనిల్ చేత పెద్ద ఎత్తున రూ.11,84,000 పెట్టుబడి పెట్టించారు . నగదుతో పాటు లాభాలు ఇవ్వాలని అనిల్ అడగగా సైబర్ నేరస్థులు స్పందించలేదు. దీంతో మోసపోయానని గుర్తించిన అనిల్ సైబర్ క్రైమ్ వారిని ఆశ్రయించాడు. ఈ ఘటనపై అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.