డబ్బులు ఊరికే రావు.. సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండండి : సిటీ సీపీ సజ్జనార్

డబ్బులు ఊరికే రావు.. సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండండి : సిటీ సీపీ సజ్జనార్

ఇబ్రహీంపట్నం, వెలుగు: అనవసర లింక్​లపై క్లిక్ చేయవద్దని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి ఆశ చూపితే నమ్మవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్  సూచించారు. డబ్బులు ఊరికే రావని, లక్కీ డ్రా, తక్కువకు గోల్డ్ అంటే మోసపోవద్దని హెచ్చరించారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్​లో యువతకు ఆదిబట్ల పోలీసులు ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్​లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.

అమ్మాయిలు ప్రైవేట్ లైప్​ను సోషల్ మీడియాలో పెట్టవద్దని సూచించారు. జాయింట్ సీపీ తప్సీర్ ఇక్బాల్, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, శంషాబాద్ జోన్ డీసీపీ రాజేశ్, డివిజన్ ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి, సీఐ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.