మరీ వృద్ధుడేంకాదు.. కానీ అసమర్థుడు

మరీ వృద్ధుడేంకాదు.. కానీ అసమర్థుడు

వాషింగ్టన్​: అధ్యక్ష పదవికి పోటీపడుతున్న జో బైడెన్ మరీ వృద్ధుడేం కాదు కానీ అసమర్థుడని మాజీ ప్రెసిడెంట్​ డొనాల్డ్ ట్రంప్ కామెంట్ చేశారు. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధ్యక్ష అభ్యర్థుల వయసు కీలకంగా మారింది. డెమోక్రాట్ల​అభ్యర్థి జో బైడెన్​కు​ 82 ఏండ్లు ఉండగా, రిపబ్లికన్​ పార్టీ తరఫున 78 ఏండ్ల ట్రంప్ ​రెండోసారి పోటీ చేస్తానని ప్రకటించారు.  

అయితే, అమెరికన్లు ఎక్కువగా తమ ప్రెసిడెంట్​ బైడెన్​ వయసు గురించే ఆందోళన చెందుతున్నారు. ఓ సర్వేలో ప్రతి నలుగురిలో ముగ్గురు బైడెన్ ​సమర్థతపై సందేహం వ్యక్తం చేశారు.

Also Rard: గాయాల వల్ల నష్టమే: ద్రవిడ్‌

 ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్​ఓడిపోతారని అభిప్రాయపడ్డారు. కాగా, యూఎస్ ​ప్రెసిడెంట్​గా అధ్యక్ష పదవి చేపట్టిన పెద్ద వయస్కుల్లో బైడెన్, ట్రంప్ తొలి రెండు స్థానాల్లో  రొనాల్డ్ రీగన్​(77) మూడోస్థానంలో ఉన్నారు.