గాయాల వల్ల నష్టమే: ద్రవిడ్‌

గాయాల వల్ల నష్టమే: ద్రవిడ్‌

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొలంబో

వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌కు ముందు శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌లాంటి ప్లేయర్లు గాయపడటం తమకు నష్టం కలిగించొచ్చని టీమిండియా హెడ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌‌‌‌‌ అన్నాడు. ఇంజ్యురీస్‌‌‌‌‌‌‌‌ కారణంగా ప్లేయర్లను మేనేజ్‌‌‌‌‌‌‌‌ చేయడం చాలా పెద్ద టాస్క్‌‌‌‌‌‌‌‌గా మారిందన్నాడు. వెన్ను నొప్పి కారణంగా ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో శ్రేయస్‌‌‌‌‌‌‌‌ కేవలం రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లే ఆడాడు. బంగ్లాతో జరిగిన ఆఖరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌కు మల్టీఫుల్‌‌‌‌‌‌‌‌ ఇంజ్యురీస్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. దీంతో ఆసీస్‌‌‌‌‌‌‌‌తో వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌, వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌కు అతను అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. ‘వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఆడే అన్ని జట్ల పరిస్థితి దాదాపు ఒకేలా ఉంది. మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు ముందు ఇలాంటి పరిస్థితి వల్ల చాలా నష్టపోతాం. 

Also Rard: మరీ వృద్ధుడేంకాదు.. కానీ అసమర్థుడు

కేవలం ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ మీద నమ్మకం పెట్టడం మినహా మరో మార్గం లేదు. కొంత మందికి  రెస్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మరికొంత మంది ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ అవసరమవుతుంది. దీన్ని బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ చేయడం కష్టంగా మారుతుంది’ అని ద్రవిడ్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. మరోవైపు మిడిలార్డర్​ బ్యాటర్​ శ్రేయస్​ అయ్యర్​ 99 శాతం ఫిట్​నెస్​తో ఉన్నాడని కెప్టెన్​ రోహిత్​ వెల్లడించాడు. అయితే అక్షర్​ పటేల్​ గాయంపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పాడు.