వెహికిల్ ట్యాంక్‌లో పెట్రోల్ ఫుల్‌గా నింపకండి.. పేలిపోతాయ్..?

వెహికిల్ ట్యాంక్‌లో పెట్రోల్ ఫుల్‌గా నింపకండి.. పేలిపోతాయ్..?

సోషల్ మీడియా వచ్చాక ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోవడం కష్టంగా మారింది. రోజుకు ఎన్నో వార్తలు సర్క్యులేట్ అవుతుంటాయి. కానీ అందులో నిజం ఎంతుంది.. అన్న విషయాన్ని చాలా మంది విస్మరించి మోసపోతున్నారు. అందులో ఒక వార్త ఈ మధ్య కాలంలో వైరల్ అవుతోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరగనున్న నేపథ్యంలో మీ వాహనాలలో పెట్రోలును పరిమిత మోతాదులో నింపించుకోండంటూ ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. లేదంటే ఇంధన ట్యాంక్ పేలిపోయే అవకాశం ఉందని, కాబట్టి సగం ట్యాంకు మాత్రం పెట్రోలు ఫిల్ చేసి, మిగతా సగం గాలితో ఖాళీగా ఉండేలా వదిలేయండంటూ ఈ వార్త సర్క్యులేట్ అవుతోంది. ఇది తెలుసుకున్న కొంత మంది ఈ వార్త నిజమేమోనని నమ్మి సగం ట్యాంకు మాత్రమే ఫిల్ చేస్తున్నారు. మరికొందరేమో అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేస్తు్న్నారు. అయితే ఈ వార్త అసలు నిజమా, కాదా అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

మీ వాహనంలో గరిష్ట పరిమితి వరకు పెట్రోల్ నింపవద్దని వస్తోన్న వార్తలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) తనిఖీ చేపట్టింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పందించిందని, శీతాకాలం లేదా వేసవితో సంబంధం లేకుండా పరిమితి (గరిష్టంగా) వరకు వాహనాల్లో ఇంధనాన్ని నింపడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పింది. ఈ రకమైన వార్తలు ఎవరూ నమ్మవద్దని, ఐవోసీఎల్ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని చెబుతూ ఇండియన్ ఆయిల్ స్పష్టం చేసిన ఓ ట్విట్ ను పీఐబీ షేర్ చేసింది.

https://twitter.com/PIBFactCheck/status/1650791263426473984