V6 News

‘దోస్త్’ వెబ్ ఆప్షన్లు షురూ..తొలిరోజు 3,804 మంది నమోదు 

‘దోస్త్’ వెబ్ ఆప్షన్లు షురూ..తొలిరోజు 3,804 మంది నమోదు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్​కోసం నిర్వహిస్తున్న దోస్త్ మొదటి విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలిరోజు సాయంత్రం వరకు 3,804 మంది విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులు, కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చారు. మరోవైపు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం సాయంత్రం వరకు మొత్తం 47,036 మంది దోస్త్ పోర్టల్‌‌‌‌‌‌‌‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు.

వీరిలో 38,700 మంది ఫీజు చెల్లించగా, 27,480 మంది తమ అప్లికేషన్లను పూర్తి చేశారన్నారు. రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 850 డిగ్రీ కాలేజీలు ఉండగా.. వీటిలో 4 లక్షలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, కొత్త కోర్సులపై ఇంకా స్పష్టత రాలేదు.