- రెండు విభాగాల్లో ‘ఎడ్యుకేషన్ వరల్డ్ జ్యూరీ’ గుర్తింపు
- కాలేజీ చైర్మన్, మంత్రి వివేక్ వెంకటస్వామి హర్షం
ముషీరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఎంబీఏ కాలేజీకి ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. ఎడ్యుకేషన్ వరల్డ్ జ్యూరీ అవార్డ్స్.. 2026–27 పేరిట ఢిల్లీలో నిర్వహించిన జ్యూరీ అవార్డ్స్ కార్యక్రమంలో అంబేద్కర్ ఎంబీఏ కాలేజీ రెండు విభాగాల్లో అవార్డులు సాధించింది. డాక్టర్ అంబేద్కర్ కాలేజీ చేపట్టిన డైవర్సిటీ ఇక్లూషన్ అండ్ఈక్విటీ చాంపియన్, ఎమర్జింగ్ స్టడీ ప్రోగ్రామ్స్ పయొనీర్ విభాగంలో 5వ ర్యాంకు సాధించింది.
ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విద్యాసంస్థల చైర్మన్ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ డాక్టర్ సరోజ వివేక్, ఇన్స్టిట్యూట్ సెక్రటరీ, బెల్లంపల్లి ఎమ్మెల్యే జి.వినోద్ గురువారం కళాశాలలో ఈ అవార్డ్స్ ను అందుకున్నారు. ఈ విజయాన్ని ప్రశంసిస్తూ కాలేజీ సీఈవో, డైరెక్టర్స్, ప్రిన్సిపల్, ఫ్యాకల్టీ సభ్యులను అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం నూతన కోర్సులు, న్యాయమైన విద్య అందించడంలో వారి కృషిని కొనియాడారు.
