ప్రపంచ బ్యాంక్ లీగల్ కన్సల్టెంట్ గా మన హైదరాబాదీ

ప్రపంచ బ్యాంక్ లీగల్ కన్సల్టెంట్ గా  మన హైదరాబాదీ
  •     18 నెలల పాటు లీగల్ కన్సల్టెంట్ గా సేవలు

బషీర్​బాగ్, వెలుగు: ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ బ్యాంక్ ర్యాంప్ (ర్యాంప్​) ప్రోగ్రామ్​కు అశోక్​నగర్​కు చెందిన చెందిన న్యాయవాది డాక్టర్ కరణం రాజేశ్ కుమార్ ఇంటర్నేషనల్ లీగల్ ప్రాసెసింగ్ యూనిట్ డైరెక్టర్​గా నియమితులయ్యారు. ఈ పదవిలో18 నెలల పాటు లీగల్ కన్సల్టెంట్​గా భారతదేశంలో ర్యాంప్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్లు, న్యాయ సంబంధిత పత్రాలను క్రోడీకరించి జగదీష్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ప్రపంచ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వానికి ఆయన సేవలు అందిస్తారు. భారత్ తరఫున ప్రపంచ బ్యాంక్​కు సేవలు అందించే అవకాశం కల్పించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ బ్యాంక్​కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత అభివృద్ధికి తోడ్పడతానని, తెలంగాణ యువ న్యాయవాదులు అంతర్జాతీయంగా సేవలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ పదవితో భారత ప్రతిష్ఠను మరింత పెంచేలా కృషి చేస్తానని డాక్టర్ రాజేశ్ కుమార్ తెలిపారు.