V6 News

జేఈఈ ఫలితాల్లో కేకేఆర్ గౌతమ్ స్కూల్ స్టూడెంట్ల హవా

జేఈఈ ఫలితాల్లో కేకేఆర్ గౌతమ్ స్కూల్ స్టూడెంట్ల హవా

హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్ ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని సంస్థ యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పాఠశాల పూర్వ విద్యార్థులు పి. మోహిత్, చంద్రశేఖర్ రెడ్డి ఆలిండియా ఓపెన్ కేటగిరీలో మొదటి ర్యాంకులు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారని చెప్పింది. ఎం. రామ సంతోశ్ 62వ ర్యాంకు, పి. చెన్న కేశవ్‌‌ 83వ ర్యాంకులు సాధించారని పేర్కొంది.

ఆలిండియా స్థాయిలో 100 లోపు వివిధ కేటగిరీల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు1, 1, 7, 8, 23, 24, 26, 34, 50, 62, 68, 71, 82, 83, 94  వంటి 15 ర్యాంకులు సాధించారని వెల్లడించింది. ఈ అసాధారణ విజయాన్ని నమోదు చేసిన విద్యార్థులను, వారికి వెన్నెముకగా నిలిచిన తల్లిదండ్రులను సంస్థ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.