డిగ్రీ.. కొత్త జీవితానికి నాంది ..ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంచుకోవాలి

డిగ్రీ.. కొత్త జీవితానికి నాంది ..ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంచుకోవాలి
  • దేశ ప్రగతిలోయువత భాగస్వాములవ్వాలి :గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివ ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుక్లా  
  • ఘనంగా డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంబేద్కర్ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సిటీ 27వ కాన్వొకేషన్​
  • 36,145 మందికి పట్టాలు.. 27 మంది ఖైదీలకు కూడా 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: డిగ్రీ పొందడం చదువుకు ముగింపు కాదని, కొత్త జీవితానికి నాంది అని గవర్నర్ ప్రతాప్ శుక్లా అన్నారు. దేశ ప్రగతిలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బుధవారం డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంబేద్కర్ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీలో వర్సిటీ 27వ కాన్వొకేషన్​ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్​గా ఆయన హాజరై మాట్లాడారు. 

45 ఏళ్ల ప్రస్థానంలో 25 లక్షల మందికి పైగా ఉన్నత విద్యావకాశాలు కల్పించిన అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సిటీ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. డిగ్రీ పట్టా ఉంటేనే సరిపోదని, ఎప్పటికప్పుడు స్కిల్స్​పెంచుకోవాలని సూచించారు. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా ప్రతీ ఇంటి నుంచి పోరాటం మొదలుకావాలన్నారు. యువతలోని సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సానుకూల దృక్పథమే వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనకు కొండంత బలమని పేర్కొన్నారు. 

న్యాక్ మాజీ డైరెక్టర్, వర్సిటీ మాజీ వీసీ వీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఓడీఎల్ వ్యవస్థ ఉన్నత విద్య ఖర్చును గణనీయంగా తగ్గించిందని తెలిపారు. మానవ అభివృద్ధికి ఏఐ ఒక సాధనంగా మాత్రమే ఉండాలని అభిప్రాయపడ్డారు.

కాంప్రెహెన్సివ్​ ఓపెన్ డిజిటల్ వర్సిటీగా మార్పు

 బోధి, డిజిటల్ కంటెంట్, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ సేవలను ఏకీకృతం చేస్తూ వర్సిటీని కాంప్రెహెన్సివ్​ ఓపెన్ డిజిటల్ యూనివర్సిటీగా మారుస్తున్నామని వీసీ ఘంటా చక్రపాణి తెలిపారు. వికసిత్ భారత్, తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా జోడించి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.  

డైరెక్టర్ ​నర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావుకు డాక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

వివిధ కోర్సులకు చెందిన 36,145 మంది విద్యార్థులకు డిగ్రీ, పీజీ, డిప్లొమా పట్టాలను ప్రదానం చేశారు. వీరిలో 38 మందికి గోల్డ్​మెడల్స్, 23 మంది పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ, ఒకరికి ఎంఫిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టాలు అందజేశారు. చెర్లపల్లి, రాజమహేంద్రవరం, కడప జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 27 మంది ఖైదీలు డిగ్రీ పట్టాలు అందుకున్నారు. కళారంగానికి చేసిన సేవలకుగానూ డైరెక్టర్, రచయిత బి.నర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుకు వర్సిటీ గౌరవ డాక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రదానం చేసింది.

చర్లపల్లి ఖైదీలు...  పోస్ట్​ గ్రాడ్యుయేట్లయ్యారు

జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో రాష్ట్ర జైళ్లశాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ సహకారంతో డిగ్రీ, పీజీ విద్యను అందిస్తోంది. ఇందులో భాగంగా పీజీ పూర్తి చేసిన 10 మంది ఖైదీలకు రాష్ట్ర గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివ ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుక్లా బుధవారం పట్టాలు ప్రదానం చేశారు. 

యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టాలు అందుకున్న వారిలో ఎనిమిది మంది ఎంఎస్సీ (సైకాలజీ), ఇద్దరు ఎంఏ (సోషియాలజీ) పూర్తి చేశారు. వీరిలో కొందరు ఇప్పటికే ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ, ఇతర డిగ్రీలు, బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి విద్యార్హతలు కలిగి ఉండగా.. జైలులో ఉన్న సమయంలోనే ఉన్నత విద్యను కొనసాగించారు. 

తెలంగాణ జైళ్లశాఖ డీఐజీ డా. డి. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చర్లపల్లి సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైలు సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జి. ప్రమోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్నాతకోత్సవానికి హాజరై పట్టాలు పొందిన ఖైదీలను అభినందించారు. ఖైదీలకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారిలో మార్పు, పునరావాసం సాధించడంతోపాటు సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు సహాయపడుతున్నామని తెలిపారు.