బ్రేక్ ఫాస్ట్ లో పాలు తాగడం మంచిదేనా..? ఉపయోగాలేంటి..?

బ్రేక్ ఫాస్ట్ లో పాలు తాగడం మంచిదేనా..? ఉపయోగాలేంటి..?

ఉరుకుల పరుగుల జనరేషన్ లో మార్నింగ్ టైంలో బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కూడా కొందరికీ సమయం దొరకదు. అలాగని పొరపాటు చేస్తే అనారోగ్యం పాలవుతారు. అయితే బ్రేక్ ఫాస్ట్ సమయంలో పాలు తీసుకోవడం కూడా చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాలలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. రోజువారి ఆహారంలో పాలు తప్పకుండా తీసుకోవాలను చెబుతున్నారు.

పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

-కాల్షియం బాగా ఉంటుంది. నీరసంగా ఉన్న సమయంలో అధిక పోషకాలతో శక్తిని ఇస్తుంది. ఎముకలు ధృడంగా ఉంటాయి. దంతాలు జీవిత కాలం గట్టిగా ఉంటాయి. ఎక్కువగా రాత్రి భోజనం చేశాక పాలు తాగుతుంటారు..అలాగే బ్రేక్ ఫాస్ట్ సమయంలోనూ పాలు తాగడం చాలా మంచిదని సూచిస్తున్నారు.

-చాలా మంది పాలు ఏ సమయంలో తాగాలో తెలియక అయోమయంలో ఉన్నారని తమ అనుభవంలో తేలిందని చెబుతున్నారు డాక్టర్లు. ఈ క్రమంలోనే పాలు ఉదయం పూట ఎలాంటి ఆహారం తీసుకోకముందు తాగినా మంచిదేనని చెబుతున్నారు. బ్రేక్ ఫాస్ట్ కు ముందు పాలు తీసుకుంటే ఆ రోజు ఎంతో ఎనర్జిగా ఉంటారు. చురుకుగా పని చేస్తారు. పాలు తాగాక కాసేపటికి బ్రేక్ ఫాస్ట్ చేయండి. కేవలం పాలతోనే సరిపెట్టుకోవద్దంటున్నారు నిపుణులు.

-రోజు పాలు తాగడంతో మతిమరుపుకు చెక్ పెట్టొచ్చు. పాలు తాగేవారి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయి పెరిగి.. మెదడు కణాలకు రక్షణ కల్పించడంలో తోడ్పడుతుంది. పాలలో ఉండే గ్లుటాథయోన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ వల్ల మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. నరాలు బలహీనపడటాన్ని తగ్గించడంలో పాలు ప్రముఖ పాత్ర వహిస్తాయని చెబుతున్నారు నిపుణులు.