అలర్ట్ : హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో తాగునీరు బంద్..

అలర్ట్ : హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో  తాగునీరు బంద్..

హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్ జారీ చేసింది జలమండలి. మహా నగరానికి ఒక రోజు తాగునీటిలో సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపింది.  సింగూరు ప్రాజెక్టులోని  పెద్దాపూర్ పంప్ హౌజ్ దగ్గరున్న 132 కేవీ కంది-పెద్దాపూర్ ఫీడర్ లో TSPDCL పలు కరెంట్ పనులు చేపట్టనుంది. ఈ నిర్వహణ పనులు కోసం ఫిబ్రవరి 22, 2024  తేదిన  గురువారం ఉదయం 8 గంటల నుంచి కొన్ని ప్రాంతాల్లో పాక్షిక, మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.

అంతరాయం ఏర్పడు ప్రాంతాలు:

  •   ఓ అండ్ ఎం డివిజన్ - 3 : షేక్ పేట్ రిజర్వాయర్ (పూర్తిగా), భోజగుట్ట (పాక్షిక).
  •   ఓ అండ్ ఎం డివిజన్ - 6 : బంజారా, ఎర్రగడ్డ రిజర్వాయర్ల ప్రాంతాల్లో (పాక్షిక), బోరబండ రిజర్వాయర్ ప్రాంతాల్లో (పూర్తిగా).
  •   ఓ అండ్ ఎం డివిజన్ - 9 & 15 : లింగంపల్లి రిజర్వాయర్ ప్రాంతాల్లో, ఆన్ లైన్ సప్లయ్ (పూర్తిగా).
  •   ఓ అండ్ ఎం డివిజన్ – 18 : ఖానాపూర్ గ్రావిటీ 1200 ఎంఎం మెయిన్ ఆన్ లైన్ సప్లయ్ ప్రాంతాలు (పూర్తిగా)

కావున పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి కోరింది. పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరా యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది.