కూకట్పల్లితో పాటు ఈ ఏరియాల్లో బుధవారం నల్లా నీళ్లు బంద్

కూకట్పల్లితో పాటు ఈ ఏరియాల్లో బుధవారం నల్లా నీళ్లు బంద్

హైదరాబాద్: నవంబర్ 26న హైదరాబాద్ నగరంలోని ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్పడుతుందని వాటర్ బోర్డు అలర్ట్ చేసింది. హైదరాబాద్ మహా నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-1,2 & 3 పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ అంతరాయంతో మంచి నీటి సరఫరాకు అంతరాయం కలిగి ఇబ్బంది అవుతుంది. 

అందువల్ల.. ఈ సమస్య తలెత్తకుండా ఉండేందుకు.. విద్యుత్ బ‌ల్క్ ఫీడర్ల నిర్వహణ, దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో అధికారులు కొత్తవి అమర్చనున్నారు. ఈ కారణంగా.. బుధవారం రోజున కృష్ణా ఫేజ్ -1,2 & 3ల‌ ద్వారా మంచినీటిని సరఫరా చేసే ప్రాంతాల్లో అంతరాయం కలుగుతుందని.. ఆయా ప్రాంతాల ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నీటిని వినియోగించుకోవాలని వాటర్ బోర్డ్ సూచించింది. జంట నగరాలకు నీటి సరఫరాలో కృష్ణా ప్రాజెక్ట్​ కీలకంగా ఉంది. గ్రేటర్​హైదరాబాద్తో పాటు ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలకు మెట్రో వాటర్​బోర్డు తాగునీటిని అందిస్తుంది

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

చార్మినార్, వినయ్ నగర్, భోజగుట్ట, రెడ్ హిల్స్, నారాయణ గూడ, ఎస్ ఆర్ నగర్, మారేడ్ పల్లి, రియాసత్ నగర్, కూకట్ పల్లి, సాహెబ్ నగర్, హయత్ నగర్, సైనిక్ పురి, ఉప్పల్, హఫీజ్ పేట్, రాజేంద్ర నగర్, మణికొండ, బోడుప్పల్, మీర్ పేట్