గ్రామాల్లో ఎమర్జెన్సీ సర్వీసులకు డ్రోన్లు

గ్రామాల్లో ఎమర్జెన్సీ సర్వీసులకు డ్రోన్లు

హైదరాబాద్‌, వెలుగు: వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో మెడిసిన్‌, బ్లడ్‌ వంటి ఎమర్జెన్సీ హెల్త్‌ సర్వీసులు అందించేందుకు డ్రోన్లను వినియోగించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్ రంజన్‌ చెప్పారు. బుధవారం ఆలిండియా రేడియోలో ‘ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ ఇన్‌ తెలంగాణ’ అనే అంశంపై ఆయన మాట్లాడారు.

మైనింగ్, లా అండ్ ఆర్డర్, ఫారెస్ట్ ప్రొటెక్షన్ వంటి రంగాల్లో టెక్నాలజీ ఉపయోగిస్తున్నారని, డ్రోన్ టెక్నాలజీతో యాదాద్రి కొత్త మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేశారన్నారు. డిజిటల్ సవాళ్లను ఎదుర్కొనేందుకు టెక్నాలజీని ఉపయోగించడంలో రాష్ట్రం ముందుందని చెప్పారు.