రైతును ముంచుతున్నారు.. కోల్డ్ స్టోరేజీలో పెత్తనం అంతా ప్రైవేట్ వారిదే

రైతును ముంచుతున్నారు.. కోల్డ్ స్టోరేజీలో పెత్తనం అంతా ప్రైవేట్ వారిదే
  • కోల్డ్‌‌ స్టోరేజీల్లో పెత్తన‍ం అంతా ప్రైవేట్‌‌ వాళ్లదే..!

నాలుగు రోజులుగా మబ్బులు పట్టి అక్కడక్కడ అకాల వర్షాలు పడుతున్నాయి. మరో వైపు మార్కెట్లలో రేట్లు డౌనయ్యాయి. మొన్నటిదాకా ఖమ్మం, వరంగల్‌‌ మార్కెట్లలో క్వింటాల్‌‌కు రూ.20 వేల దాకా పలికిన ధరలు ఇప్పుడు ఆకస్మాత్తుగా రూ.15 వేల కంటే కిందికి పడిపోయాయి. దీంతో రైతులు కల్లాల్లో ఉన్న మిర్చీని బస్తాల్లోకి ఎక్కించి కోల్డ్‌‌ స్టోరేజీలకు తీసుకెళదామంటే అక్కడ ప్రైవేట్‌‌ వ్యాపారస్తుల పెత్తనమే నడుస్తోంది. 

తక్కువ ధరలకు మిర్చి కొన్న అడ్తీ వ్యాపారులు, కొనుగోలుదారులు తమ బస్తాలను కోల్డ్‌‌ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారు. 6 నెలల సమయానికి ఒక్క బస్తాకు రూ.160 చొప్పున తీసుకోవాలి. బ్లాక్‌‌లో దీనికి మూడు రేట్లు పెంచి రూ.480 తీసుకుంటున్నారు. అయినా రైతులు వేసుకునే బస్తాలకు స్థలం లేదని చెబుతున్నారు. వరంగల్‌‌ మార్కెట్‌‌ పరిసర ప్రాంతాల్లో 25 కోల్డ్‌‌ స్టోరేజీలుంటే అన్నీ మిర్చి బస్తాలతో నిండాయని చెబుతున్నారు. 

ఒక్కో కోల్డ్‌‌ స్టోరేజీలో 50 వేల నుంచి లక్షకు పైగా బస్తాలు నిల్వ చేసుకోవచ్చు. వీటిలో 70 శాతం బస్తాలు నిల్వ చేసుకునే అవకాశం మిర్చి రైతులకే ఉంటుంది. అయినా, కూడా రైతులకు మాత్రం ప్లేస్‌‌ దొరకట్లేదని చెబుతున్నారు. దీంతో కల్లాల్లోనే మిర్చిని కాపాడుకోవాల్సి దుస్థితి దాపురించింది.