సూరారంలో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్

సూరారంలో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్

సూరారం పరిధిలో డ్రగ్స్ తయారు చేసే గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. గ్యాంగ్ లోని ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 60 గ్రామ్స్ క్రిస్టల్ 700ML మెథ ఫెట మైన్ ను సీజ్ చేశామని తెలిపారు. స్వాధీనం చేసిన డ్రగ్స్ విలువ రూ. 50 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. 

ముగ్గురు నిందితుల పేర్లు1. కమ్మ శ్రీనివాస్,2 G.నరసింహ రాజు 3. D. నాగరాజు అని వివరించారు. ప్రధాన నిందితుడు కమ్మ శ్రీనివాస్ రాజుకు డ్రగ్స్ అమ్మకంలో గతంలో నేర చరిత్ర ఉందని 2013లో మెథ ఫెట మైన్ డ్రగ్స్ ను తయారు చేస్తూ.. జీడిమెట్ల ప్రాంతంలో పట్టుబడ్డాడని వెల్లడించారు. 2017లో శ్రీనివాస్ జైలు నుంచి రిలీజయిన తరువాత మిగతా నిందితులు నరసింహ రాజు, నాగరాజుతో కలిసి దందా మొదలుపెట్టాడని పోలీసులు చెప్పారు.