డ్రగ్స్ సప్లై చేస్తున్న నలుగురి అరెస్టు

 డ్రగ్స్ సప్లై చేస్తున్న నలుగురి అరెస్టు

న్యూ ఇయర్ వేడుకలపై గట్టి నిఘా పెట్టిన పోలీసులు డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎల్బీనగర్ పరిధిలోనీ ఎస్ఓటీ నేరేడ్ మెట్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి MDMA, ISD పేపర్, హాష్ ఆయిల్‭ను స్వాధీనం చేసుకున్నారు. 

గోవా నుంచి హైదరాబాద్‭కు డ్రగ్స్‭ను తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల వద్ద నుంచి ఒక కార్, నాలుగు సెల్ ఫోన్లు, ఒక బైక్‭తో పాటు 36 గ్రాముల MDMA, 3 బాటిల్స్ హాష్ ఆయిల్,12 ISF బోల్ట్స్, 3 OSD పేపర్లను పోలీసులు సీజ్ చేశారు. న్యూ ఇయర్ వేడుకలను ఆసరాగా తీసుకుని ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.