హైదరాబాద్ : డ్రగ్స్ పెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్ తో డొంక కదులుతోంది. మస్తాన్ సాయి ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీంతో మస్తాన్ సాయి ల్యాప్ టాప్ లోని వీడియోలను పరిశీలించగా సంచలన విషయాలు బయట పడ్డాయి. అమ్మాయిలతో అసభ్యంగా ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేశాడు మస్తాన్ సాయి.
దీంతో మస్తాన్ సాయి స్నేహితురాలు ప్రీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ సేవిస్తూ ప్రీతి, ఉదయ్ తీసుకున్న వీడియోలు ఉన్నాయి. అలాగే డ్రగ్స్ తీసుకురావాలని వాట్సప్ చాటింగ్ చేసింది ప్రీతి. డ్రగ్స్ తీసుకురావాలని లేదంటే అందరినీ డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని వార్నింగ్ ఇచ్చింది. ఈ వ్యవహారంపై పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ సప్లై , కస్టమర్ల వ్యవహారంపై పోలీసుల ఆరాతీస్తున్నారు.
వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయి ఆగస్టు 12న ఏపీలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.. లావణ్య రాజ్ తరణ్ కేసులోనూ మస్తాన్ సాయి, ప్రీతి పేర్లు వినిపించాయి.
