
నాలుగు పెగ్గులేస్తేనే మాటలు అదుపులో ఉండవు. అలాంటిది పీకలదాకా తాగితే ఊరుకుంటారా! అస్సలు ఊరుకోరు. ఓ ఉద్యోగి అలాంటి పనే చేశాడు. పీకలదాకా తాగిన సదరు ఉద్యోగి.. బాస్ పై పొగడ్తలు కురిపిస్తూ అతనికే సందేశాలు పంపాడు. ప్రస్తుతం వారి సంభాషణకు సంబంధించిన మెసేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"బాస్.. నేను తాగి ఉన్నా. నేను మీకు ఓ విషయం చెప్పాలి. మీరు నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు. నాకు కష్టమైన ఛాలెంజ్‌లు ఇచ్చినందుకు థ్యాంక్స్. మంచి కంపెనీ కంటే మంచి మేనేజర్ దొరకడం అదృష్టం. ఆ విషయంలో నేను లక్కీ.." అంటూ బాస్‌కు సదరు ఉద్యోగి మెసేజ్‌లు పంపించాడు.
తన ఉద్యోగి పంపిన మెసేజులను స్క్రీన్ షాట్ రూపంలో ట్విటర్‌లో షేర్ చేసిన సిద్ధాంత్ అనే వ్యక్తి.. దానికి తాగేసి ఉన్న ఉద్యోగి నుంచి మెసేజ్‌లు ఫర్వాలేదు? కానీ, మీకు ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయా..? అని కామెంట్ జోడించాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Drunk text from ex is okay but have you ever received drunk texts like these? pic.twitter.com/rvkaGMYqLl
— Siddhant (@siddhantmin) August 4, 2023
సాధారణంగా ఒకే సంస్థలో పని చేసే బాస్- ఉద్యోగి మధ్య అనుబంధం అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాంటిది తిట్టకుండా.. పొగిడాడంటే ఆలోచించాల్సిందే. ఈ పోస్ట్‌పై నెటిజెన్స్ చాలా ఫన్నీగా రెస్పాండ్ అవుతున్నారు. "మీ ఉద్యోగి చాలా మంచోడు.. తాగిన మత్తులో కూడా మిమ్మల్ని తిట్టకుండా.. పొగిడాడంటే మీ నాయకత్వ లక్షణాలు గొప్పవే అయ్యుండాలి.." అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.