పీకల దాకా తాగి చోరీ చేసి...రాత్రంతా ఇంట్లోనే దర్జాగా పడుకున్నడు

పీకల దాకా తాగి చోరీ చేసి...రాత్రంతా ఇంట్లోనే దర్జాగా పడుకున్నడు

మామూలు దొంగలు  గుట్టు చప్పుడు కాకుండా చోరీకి వచ్చి తమ పని కానిచ్చేసి వెళ్తారు. కానీ ఇక్కడ ఓ దొంగ పీకలదాకా తాగి వచ్చి చోరీ చేసి  దొరికిపోయాడు . తెల్లవారుజామున ఇంటి ఓనర్ కు చిక్కాడు.ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో జరిగింది.  

అసలేం జరిగిందంటే  జనవరి 18న రాత్రి తాళం వేసిన ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు ఓ దొంగ. అయితే  తాగిన మైకంలో బయటకు వెళ్ళ లేక ఇంట్లోనే పడుకున్నాడు. తెల్లవారుజామున  యజమాని వచ్చి తాళం తీసి చూసే వరకు ఇత్తడి, ఇనుప సామాన్లు సంచిలో నింపుకుని పడుకుని కనిపించాడు.  పోలీసులకు సమాచారం ఇచ్చి దొంగను పట్టించాడు  యజమాని మాలి పటేల్. \

►ALSO READ | భార్య గొంతు కోసిన భర్త..అడ్డొచ్చిన కూతురిపై రోకలి బండతో దాడి

ఈ మధ్య దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఇంటి యజమానులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.