V6 News

హయత్ నగర్ లో మందు బాబుల బీభత్సం

హయత్ నగర్ లో మందు బాబుల బీభత్సం
  •     తప్పతాగి కారుతో వీరంగం
  •     రోడ్డు పక్కన పార్క్​ చేసిన వాహనాలు తుక్కుతుక్కు

ఎల్బీనగర్, వెలుగు: తప్పతాగి హయత్​నగర్​లో ముగ్గురు వ్యక్తులు కారుతో బీభత్సం సృష్టించారు. అతివేగంగా, అడ్డగోలుగా కారు నడిపి రోడ్డు పక్కన పార్క్ చేసి వాహనాలపైకి దూసుకెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం.. హయత్​నగర్​కు చెందిన నరేశ్ తన ఫ్రెండ్స్ వెంకటేష్, శివకృష్ణతో కలిసి నగర శివారులో మద్యం సేవించాడు. అనంతరం కారులో తిరిగి వస్తూ.. మద్యం మత్తులో స్టీరింగ్​పై నియంత్రణ కోల్పోయాడు. 

అతివేగంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన రెండు బైకులు, ఒక కారును ఢీకొట్టాడు. ప్రమాద ధాటికి వాహనాలు తుక్కుతుక్కు కాగా, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో హయత్​నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.  బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో నిందితులు మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో అదుపులోకి తీసుకున్నారు.