లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు బంద్ కావడంతో మందు బాబుల ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మద్యంకు బానిసైన వారు పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్, ఎర్రగడ్డలోని మానసిక వికలాంగుల హాస్పిటల్ కు క్యూ కడుతున్నారు.
నాలుగు రోజులుగా మందు బాబుల కేసులు ఎక్కువైనట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారు. మద్యం దొరకక వింతగా ప్రవర్తిస్తున్నారని.. కొంత మంది గాయాలు చేసుకుంటున్నారని చెబుతున్నారు ఎర్రగడ్డ మానసిక వికలాంగుల డాక్టర్లు.

