వెదర్ ఎఫెక్ట్.. శంషాబాద్ విమానాశ్రయంలో 29 విమానాలు రద్దు

వెదర్ ఎఫెక్ట్..   శంషాబాద్ విమానాశ్రయంలో 29 విమానాలు రద్దు

శంషాబాద్, వెలుగు: వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్​ విమానాశ్రయంలో ఇప్పటివరకు 29 విమానాలు రద్దయ్యాయని విమానయాన అధికారులు తెలిపారు. మంగళవారం శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన 12 ఇండిగో, 2 ఎయిర్ ఇండియా విమానాలు రద్దయ్యాయి.

 ఢిల్లీ నుంచి శంషాబాద్‌‌‌‌కు రావాల్సిన 13 ఇండిగో, 2 ఎయిర్ ఇండియా విమానాలు కూడా రద్దు చేశారు. ఢిల్లీలో వాతావరణం అనుకూలించకపోవడమే రద్దుకు కారణమని ఎయిర్‌‌‌‌లైన్స్ అధికారులు వెల్లడించారు.