ఉపాధి హామీ నిర్వీర్యానికి కుట్ర : చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

ఉపాధి హామీ నిర్వీర్యానికి కుట్ర : చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
  • సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

 కరీంనగర్ సిటీ, వెలుగు: గ్రామాల్లోని పేదలకు ఉపాధి కల్పించేందుకు గతంలో యూపీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ఈ స్కీమును నిర్వీర్యం చేయాలని చూస్తోందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. సిటీలోని సుడా చైర్మన్ క్యాంపు ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ ఉపాధి హామీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఎంప్లాయిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొరుకుతుందన్నారు. 12 ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏ ఒక్క పథకం తీసుకురాకపోగా ఉన్న పథకాలను తొలగిస్తోందని ఆరోపించారు. 

బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు మొండిచేయి చూపే కుట్రచేస్తోందని ఆరోపించారు. సమావేశంలో లీడర్లు పిట్టల రవీందర్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కుర్ర పోచయ్య, దండి రవీందర్, మేకల నర్సయ్య, రమణారెడ్డి, సుదర్శన్, మేరాజ్, మాసుంఖాన్, తోట అంజయ్య, బషీర్, తిరుపతి, కొట్టె ప్రభాకర్, అష్రఫ్, బత్తుల రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.