జన, కులగణన- 2027 డిజిటల్‌‌‌‌‌‌‌‌లో

జన, కులగణన- 2027 డిజిటల్‌‌‌‌‌‌‌‌లో

స్వాతంత్ర్యానంతరం మొదటిసారి డిజిటల్‌‌‌‌‌‌‌‌   వేదికగా జన,కులగణన 2027లో  ప్రారంభం కానున్నదని  కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు మినహా  ఇతర కులాల గణన జరగలేదు.  రాజకీయ,  సామాజిక కోణాలను  దృష్టిలో పెట్టుకొని వివిధ రాష్ట్రాలు  తమ పరిధిలో  సమానత్వ సాధన ప్రణాళికలు చేయడానికి 2027 జన,కులగణన ప్రక్రియ దోహదపడనుంది.  

తొలి దశలో  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌-– సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 2026 మధ్య కాలంలో గృహ జాబితా తయారీ,  రెండో దశలో  ఫిబ్రవరి 2027 నుంచి  జన, కులగణన జరగనున్నాయి. మొబైల్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా  డేటా సేకరించడానికి 35 లక్షల సిబ్బందికి తగిన శిక్షణను ఇవ్వనున్నారు.  దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ  1 మార్చి 2027న  ప్రారంభం కానున్నది.  వాతావరణ ప్రతికూలతలను దృష్టిలో పెట్టుకొని జమ్ము కాశ్మీర్,  లడక్‌‌‌‌‌‌‌‌,  హిమాచల్‌‌‌‌‌‌‌‌, ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌ లాంటి ప్రాంతాల్లో 1 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 2026 రోజున ఈ ప్రక్రియ మొదలుకానుంది. 

భారత్​లో జనగణన చరిత్ర..

బ్రిటిష్‌‌‌‌‌‌‌‌ ఇండియాలో  కమిషనర్‌‌‌‌‌‌‌‌  డబ్ల్యూ. సి. ప్లోవ్‌‌‌‌‌‌‌‌డెన్‌‌‌‌‌‌‌‌  నాయకత్వంలో  తొలి ఆధునిక జనగణన ప్రక్రియ 1881లో  ప్రారంభం కాగా తర్వాత 1891, 1901, 1911 - 1921ల్లో  కూడా జరిగింది.  దేశ స్వాతంత్ర్యానంతరం జనగణన చట్టం 1948 ఆధారంగా 1951లో  తొలిసారి జనగణన జరిగింది. 1961లో  జరిగిన  గణనలో  గ్రామీణ కళలు,  పండుగలు, వన జాతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ  తీసుకోవడం జరిగింది.  1971లో  నిర్వహించిన 11వ జనగణన ప్రక్రియ ద్వారా  దేశంలో  జరుగుతున్న  అంతర్గత వలసల (మైగ్రేషన్‌‌‌‌‌‌‌‌ మ్యాపింగ్‌‌‌‌‌‌‌‌) వివరాలకు  ప్రత్యేక  ప్రాధాన్యం ఇవ్వడం చూశాం. 1981లో  జరిగిన 12వ  జనగణనలో 68.3 కోట్ల దేశ జనాభా, 1991లో  13వ జనగణన ద్వారా 84.6 కోట్లు,  2001లో 14వ  జనగణనలో 102.8 కోట్లు,  2011లో 15వ జనగణన ద్వారా 121.0  కోట్ల జనాభాను నమోదు చేయడం జరిగింది.  2021లో  జరగనున్న 16వ  జనగణన  ప్రక్రియ  కొవిడ్‌‌‌‌‌‌‌‌-19 కారణంగా వాయిదా పడింది.  16వ జన, కులగణనను 2027లో  జరపడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వేగంగా ఏర్పాట్లు  చేస్తున్నది. 

పాలసీల  రూపకల్పన 

1981లో  12.5 లక్షల మంది సిబ్బందిని  వినియోగించగా, 2011లో 27 లక్షల మంది సేవలను వినియోగించుకున్నారు.  2011లో 16వ జనగణన జరగగా 2027లో 16వ జనగణనకు తలుపులు తెరుచుకోనున్నాయి.  2011లో  35 రాష్ట్రాలు/యూటీలను చెందిన 640 జిల్లాలు, 7,933 పట్టణాలు, 6.41 గ్రామాల్లో జనగణన జరిగింది. 2011 జనగణన వివరాల ఆధారంగా దేశంలో 79.8 శాతం హిందువులు, 14.2 శాతం ముస్లింలు, 2.3 శాతం క్రిస్టియన్లు, 1.7 శాతం సిక్కులు, 0.7 శాతం బౌద్ధ మతస్తులు,  0.4 శాతం  జైనులు  నమోదు అయ్యారు.  జనగణన వివరాలతో పాలసీల  రూపకల్పన,  సంక్షేమ పథకాల విస్తరణ, సరైన  లబ్ధిదారులను గుర్తించి పథకాలను అందజేయడం జరుగుతుంది.  2011లో  పేపర్‌‌‌‌‌‌‌‌ రహిత  జనగణన పూర్తి చేయడానికి 6.4 లక్షల ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగించడం జరిగింది. 

డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌

1951లో  జరిగిన  జనగణన  వివరాల ఆధారంగా 1952  డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌  కమిషన్‌‌‌‌‌‌‌‌ ద్వారా 494  పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ స్థానాలు ఏర్పడ్డాయి.  ప్రస్తుతం 2027  జనగణన వివరాల ఆధారంగా  పార్లమెంట్/అసెంబ్లీ‌‌‌‌‌‌‌‌ స్థానాలు పెరగడం ద్వారా 2029 సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. 16వ  జనగణన  ప్రక్రియ- 2027లో  పూర్తి చేయడానికి  కేంద్ర ప్రభుత్వం రూ. 11,718 కోట్ల  నిధులను  వెచ్చించనున్నది.  అత్యంత  ప్రాముఖ్యత కలిగిన 2027 జనగణన ప్రక్రియ ప్రపంచంలోనే అతి పెద్ద పరిపాలన, గణాంకపరమైన వివరాల సేకరణగా చరిత్రలో నిలవనుంది. 2027లో  నిర్వహించే 16వ జన, కులగణన  ప్రక్రియ సజావుగా జరిగి,  సమానత్వ సాధనకు మార్గం సుగమం కానుంది.

- డా. బుర్ర 
మధుసూదన్ రెడ్డి