- కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు : ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమాన్ని యువ పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమం ద్వారా ప్రతిభ ఉన్న యువత ఆవిష్కర్తలు, స్టార్టప్ లకు సమాన అవకాశాలు కల్పిస్తుందన్నారు. డిసెంబర్ 20న మహబూబ్ నగర్ ఐటీ టవర్‌లో ఇన్నోవేషన్కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ప్రతిభకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ఇన్నోవేషన్ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాగేంద్రం, డీఈవో విజయలక్ష్మి, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ప్రియాంక, డీపీవో శ్రీకాంత్, నోడల్ ఆఫీసర్ రమేశ్‌బాబు, ఈడీఎం శివ తదితరులు పాల్గొన్నారు.
