- చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్బాలరాజు
గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో పనిచేస్తున్న భద్రతా సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని, సంస్థ ఆస్తులు కాపాడడంలో, సిబ్బంది ప్రాణాలు కాపాడడంలో అప్రమత్తతంగా ఉండాలని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పి.బాలరాజు సూచించారు. ఇటీవల చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారిగా మంగళవారం గోదావరిఖనిలోని ఆర్జీ 1 ఏరియాను సందర్శించారు.
ఈ సందర్భంగా సింగరేణి ఆఫీసర్లు పుష్ఫగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సెక్యూరిటీ ఆఫీసర్ మాట్లాడుతూ సెక్యూరిటీ సిబ్బంది భద్రతా ప్రమాణాలను కఠినంగా పాటించాలన్నారు.
సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం ఎప్పుడూ ప్రాధాన్యమిస్తుందని భరోసా కల్పించారు. కాగా ఓసీపీ 5 చెక్‌పోస్ట్‌ను సందర్శించి కోల్ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన లారీల చెక్అవుట్, తదితర విషయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో జీఎం లలిత్‌కుమార్, ఎస్‌వోటూ జీఎం చంద్రశేఖర్, రవీందర్‌రెడ్డి, హన్మంతరావు, వీరారెడ్డి, శ్రీనివాస్, ఎండీ అక్బర్అలీ పాల్గొన్నారు.
