జిల్లా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు : కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్

జిల్లా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు : కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్
  •     జగిత్యాల ఎమ్మెల్యేపై  కోరుట్ల ఎమ్మెల్యే విమర్శలు

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభద్రతా భావం, ఆత్మన్యూనతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ విమర్శించారు. ఇటీవల తనపై, తన తండ్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను  తీవ్రంగా ఖండించారు. మంగళవారం జగిత్యాల ధరూర్ క్యాంపులోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. జగిత్యాలకు ఆయన కృషి వల్లే మెడికల్ కాలేజీ వచ్చిందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేశారని, దానిలో భాగంగానే జగిత్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటైందన్నారు. 

మెడికల్ కాలేజీలు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్ ప్రకారం వస్తాయని, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రావని స్పష్టం చేశారు. ‘ మా నాన్న స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్. కానీ మీరు రాజకీయాల్లోకి వచ్చాకే కాంట్రాక్టర్ అయ్యారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. నేను కోరుట్లలో రాజీనామా చేస్తా.. మీరు జగిత్యాలలో రాజీనామా చేయండి. ఇద్దరం ఎన్నికలకు వెళ్దాం.. దమ్ముంటే రాజీనామా చేయాలి’ అని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సవాల్ విసిరారు.