సర్పంచులకు అండగా ఉంటాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సర్పంచులకు అండగా ఉంటాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  •     మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

 జగిత్యాల రూరల్, వెలుగు: కొత్తగా ఎన్నికైన సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, అభివృద్ధి విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. 

జగిత్యాల జిల్లా కేంద్రంలో కొత్తగా సర్పంచులకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగదని, వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్లు కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకే రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ టిక్కెట్లు ఇవ్వాలని మంత్రిని కోరారు. పార్టీ కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని సూచించారు. 

‘డీసీసీ అధ్యక్ష పదవి జీవన్ రెడ్డి పెట్టిన భిక్ష’

తాను ప్రలోభాలాకు లొంగే వ్యక్తిని కాదని, అవసరమైతే పదవీ త్యాగం చేస్తానని జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య ఎమోషనల్ కామెంట్స్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సర్పంచుల అభినందన సభకు హాజరయ్యారు. ఈ సభలో ఇటీవల ఆయన ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలవడంపై కొందరు ప్రశ్నించారు. దీంతో మంత్రి ఎదుట డీసీసీ ప్రెసిడెంట్ భావోద్వేగానికి గురయ్యారు. డీసీసీ పదవి తనకు జీవన్ రెడ్డి పెట్టిన భిక్ష అని, ఆయనకు చెడ్డపేరు వస్తుందంటే తక్షణమే పదవికి రాజీనామా చేస్తానన్నారు.