న్యూఢిల్లీ: కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా సాయిరామ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ కు నేతృత్వం వహించారు. పీఎం ప్రసాద్ రిటైర్మెంట్ తర్వాత కంపెనీ అదనపు కార్యదర్శి సనోజ్ కుమార్ తాత్కాలిక బాధ్యతలు నిర్వహించగా, ఇప్పుడు సాయిరామ్ పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. సౌర విద్యుత్, క్లిష్టమైన ఖనిజాల సేకరణ, కోల్ గ్యాసిఫికేషన్ రంగాల్లోకి కూడా సంస్థ విస్తరిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సాయిరామ్ ఎన్ఐటీ రాయపూర్‌లో మైనింగ్ ఇంజనీరింగ్ చదివారు.
