Weather News : బంగాళాఖాతంలో ద్రోణి.. 2 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు

Weather News : బంగాళాఖాతంలో ద్రోణి.. 2 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు

నిప్పుల కొలిమిలాగా మండిన ఎండలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. పగలంతా భానుడి భగభగలున్నా.. సాయంత్రానికి కాస్త చల్లని గాలులు తెలుగు రాష్ట్రాలలో ఉపశమనం కలిగిస్తున్నాయి. ఇక బంగాళా ఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్రం 2026 మే 11వ తేదీన వెల్లడించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ లో గురువారం (14) వరకు కోస్తాంధ్రలో, మంగళవారం (12) వరకు రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

►ALSO READ | కలియుగ వైకుంఠం.. తిరుమలలో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు

ఇవాళ (మే 11) మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 30-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.