న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగుతూనే ఉండటం వల్ల ఈసారి పండుగ సీజన్ అమ్మకాలు విపరీతంగా తగ్గే అవకాశం ఉంది. ట్రాకిన్ టెక్, టెక్‌ఆర్క్ రిపోర్ట్ప్రకారం.. ఈ ఏడాది జులై నుంచి డిసెంబర్ మధ్య కాలంలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారిలో 54 శాతం మంది తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవచ్చు లేదా పాత ఫోన్ల వైపు మొగ్గు చూపవచ్చు.
దీనివల్ల వార్షిక అమ్మకాలు 30 శాతం వరకు తగ్గవచ్చు. గత ఏడాది 13.8 కోట్ల యూనిట్లుగా ఉన్న అమ్మకాలు ఈసారి 12 కోట్ల యూనిట్లకు పడిపోవచ్చు. మెమరీ చిప్స్ ధరలు పెరగడం వల్ల గతేడాది జనవరి నుంచే ధరలు భారీగా పెరిగాయి.
ముఖ్యంగా రూ.20 వేలలోపు బడ్జెట్ ఫోన్ల ధరలు 12 శాతం దాకా పెరిగాయి. రూపాయి విలువ తగ్గడం, కంపెనీలు అమ్మకపు ధరలను పెంచడం ఇందుకు ప్రధాన కారణాలు.
