
బెంగళూరు: సెంట్రల్ జోన్‌తో గురువారం ప్రారంభమైన దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ బ్యాటింగ్‌లో తడబడింది. స్పిన్నర్లు సారాన్ష్ జైన్ (5/49), కుమార్ కార్తికేయ (4/53) మ్యాజిక్ చేయడంతో.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో 149 రన్స్‌కే కుప్పకూలింది. తన్మయ్ అగర్వాల్ (31) టాప్ స్కోరర్. సల్మాన్ నిజర్ (24), అంకిత్ శర్మ (20) ఓ మాదిరిగా ఆడారు.
మోహిత్ కాలే (9), రవిచంద్రన్ స్మారన్ (1), రికీ భుయ్ (15), మహ్మద్ అజారుద్దీన్ (4), అండ్రీ సిద్ధార్థ్ (12), గుర్జప్నీత్ సింగ్ (2), నిదీశ్ (12) విఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్ ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో 50/0 స్కోరు చేసింది. డానిష్ మాలేవర్ (28 బ్యాటింగ్), అక్షయ్ వాడ్కర్ (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సెంట్రల్ ఇంకా 99 రన్స్ వెనకబడి ఉంది.