
బెంగళూరు: బ్యాటింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (184) సెంచరీతో చెలరేగడంతో.. గురువారం సెంట్రల్ జోన్‌తో మొదలైన దులీప్ ట్రోఫీ సెమీస్‌లో వెస్ట్ జోన్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. యశస్వి జైస్వాల్ (4), శ్రేయస్ అయ్యర్ (25) ఫెయిలైనా.. తనుష్ కొటియాన్ (65 బ్యాటింగ్) రాణించడంతో.. వెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 363/6 స్కోరు చేసింది. తనుష్‌తో పాటు కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (24 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్‌కు ఆరంభంలోనే సెంట్రల్ బౌలర్లు షాకిచ్చారు. 10 రన్స్‌కే జైస్వాల్, హార్విక్ దేశాయ్ (1) ఔటయ్యారు. ఈ దశలో రుతురాజ్.. ఆర్యా దేశాయ్ (39)తో మూడో వికెట్‌కు 82, శ్రేయస్ అయ్యర్‌తో నాలుగు వికెట్‌కు 55, శామ్స్ ములానీ (18)తో ఐదో వికెట్‌కు 42, తనుష్‌తో ఆరో వికెట్‌కు 148 రన్స్ జోడించాడు.