లక్కీ భాస్కర్ ఎఫెక్ట్.. తెలుగులో మరో రెండు సినిమాలకి ఒకే చెప్పిన దుల్కర్..

లక్కీ భాస్కర్ ఎఫెక్ట్..  తెలుగులో మరో రెండు సినిమాలకి ఒకే చెప్పిన దుల్కర్..

తెలుగులో ప్రముఖ డైరెక్టర్ వెంకీ అట్లూరి, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో వచ్చిన లక్కీ భాస్కర్ హిట్ అయ్యింది. దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకూ దాదాపుగా రూ.80 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే దుల్కర్ కి తెలుగులో కూడా లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ ఉంది. దీనికితోడు లక్కీ భాస్కర్ మంచి హిట్ అవ్వడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో కెరీర్ ని సెట్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

కాగా ఇటీవలే దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్టార్ హీరో మరియు ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి నిర్మిస్తున్న సినిమాలో హీరోగా నటించిందేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఈ ప్రాజెక్ట్ కూడా పీరియాడిక్ డ్రామాగా ఉండనున్నట్లు సమాచారం. 

అయితే ఇప్పటికే దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న ఆకాశంలో ఒక తార అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో దుల్కర్ కి జంటగా బ్యూటీఫుల్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది. ప్రస్తుతం సాయి పల్లవి రామాయణం, తండేల్, తదితర సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగులు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి.